Homeహైదరాబాద్latest Newsఅల్ఫోర్స్‌లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

అల్ఫోర్స్‌లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

ఇదే నిజం, కరీంనగర్ ఎడ్యుకేషన్: అల్ఫోర్స్ శ్రీ విద్యాభారతి స్కూల్లో యుకెజీ విద్యార్థులకు మంగళవారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. విద్యా సంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాధమిక విద్యలో చాలా విషయాలు ఉంటాయని, వాటిని విద్యార్థులకు వివిధ రకాలుగా ఆసక్తి పెంపొదించే విధంగా, పోటీతత్వం పెరిగేలా విద్యనందించాలని చెప్పారు. తల్లితండ్రులు కూడా పిల్లలకు వివిధ విషయాలను చాలా సృజనాత్మకంగా, వినూత్నంగా తెలియపర్చి అగ్రగామిగా నిలిపాలన్నారు. ఆదర్శంగా ఉండాలని కోరారు. విశ్వవిద్యాయాల్లో విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని అందించే రీతిలో చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆలపించిన రైమ్స్, స్టోరీస్, పజిల్స్ అకట్టుకున్నాయి.

Recent

- Advertisment -spot_img