వచ్చే నెల 10వ తేదీ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులు తొందరపడి బయట అమ్ముకొని నష్టపోవద్దని చెప్పారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 33,15,426 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా 4,68,874 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లతో నిజామాబాద్ టాప్లో ఉంది. కొనుగోళ్లకు సంబంధించి రైతులకు రూ.1,344 కోట్లు చెల్లించాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది.