Grama Sabalu : తెలంగాణ రాష్ట్రంలో గ్రామ సభలు ముగిసాయి. నాలుగు రోజుల పాటు గ్రామసభలు కొనసాగాయి. ఈ క్రమంలో కొన్ని చోట్ల ఆందోళనల ఘర్షణలు మధ్య గ్రామసభలు జరిగాయి. తమ పేరు జాబితాలో లేదంటూ కొంత మంది ప్రజలు నిరసన తెలిపారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ప్రారంభం కానుంది. నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేస్తున్నారు.