యంగ్ హీరోయిన్ మలయాళీ ముద్దుగుమ్మ అపర్ణ దాస్ పెళ్లికి రెడీ అయ్యింది. నటుడు దీపక్ పరంబోరల్‌తో ఆమె ఏడడుగులు వేయనున్నారు. బుధవారం (ఏప్రిల్ 24) అపర్ణ, దీపక్ వివాహం జరగనుంది. ఈ క్రమంలోనే తాజాగా వీరి హల్దీ వేడుక గ్రాండ్‌గా జరిగింది. హల్దీ వేడుకల్లో అపర్ణ హాఫ్ శారీలో మెరిశారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

