ఇదేనిజం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో మాజీ మంత్రి వర్యులు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే పుట్టపాగ మహేంద్రనాథ్ పుట్టిన రోజు వేడుకలను అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామనాథం, యువజన రాష్ట్ర నాయకులు కుంద మల్లికార్జున్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశన్న యాదవ్, ఐఎన్టీయూసీ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ, జిల్లా నాయకులు కపిలవాయి శేఖర్, బీసీ సెల్ టౌన్ అధ్యక్షులు తిరుపతయ్య గౌడ్, మాజీ ఎంపీటీసీ రాములు, యూత్ కాంగ్రెస్ తాలూకా అధ్యక్షులు అజయ్ యాదవ్, యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు దొడ్ల మహేష్, ఐ ఎన్ టి సి టౌన్ అధ్యక్షులు గౌస్ పాషా, ఎంఆర్ పి ఎస్ జిల్లా నాయకులు అవుటకాసిం, అచ్చంపేట కౌన్సిలర్ నారమళ్ళ విష్ణు, అమ్రాబాద్ మండల అధ్యక్షులు రాజగోపాల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గణేష్ పోలేరవి, వెంకటేష్,రవి, శ్రీరామ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.