ఇదే నిజం, జగిత్యాల: జగిత్యాల రూలర్ మండల పరిధిలోని ధర్మారం గ్రామంలో బుధవారం మాజీ ఉపసర్పంచ్ గోస్కుల గంగాధర్ ఆధ్వర్యంలో చత్రపతి సాహు మహారాజ్ 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సంఘ సంస్కర్త, రిజర్వేషన్ల పితామహుడు బలహీన వర్గాలకు ఉన్నతికి సామాజిక గౌరవం కల్పించడానికి వారు చేసిన వారు చేసిన సేవలు స్మరించుకోవడమైందన్నారు. మహిళలకు చట్టపరమైన హక్కులు విద్య వ్యాప్తికై వారు చేసిన సేవల గూర్చి కొనియాడారు. అనంతరం మహారాణి అహల్య బాయి 350వ జయంతి జరిపారు.ఈ కార్యక్రమంలో సామాజిక సమరసత వేదిక సభ్యులు ఆకుతోట వెంకట రమణారెడ్డి, భూమారెడ్డి,సోమిరెడ్డి, లచ్చన్న, శ్రీను, ముద్ధసాని లవ్ కుమార్,నివేద్ రావు, గోస్కుల మహేష్, సత్యనారాయణ రావు, అంజన్న, రవి, వెంకట్ రమణ, లక్ష్మణరావు, మహిళలు పాల్గొన్నారు.