Homeహైదరాబాద్latest Newsఘనంగా పోచమ్మ బోనాలు

ఘనంగా పోచమ్మ బోనాలు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం మొర్రయిపల్లి గ్రామంలో అన్ని కుల సంఘాల గ్రామస్తులు పోచమ్మ బోనాలు తీసి ఆలయానికి బయల్దేరిన మహిళలు,గ్రామాల్లో ప్రతీ ఇంటి నుంచి బోనాన్ని ఎత్తుకొని మహిళలు ఆలయానికి బయల్దేరారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, యువకుల కేరింతల మధ్య బోనాలతో పెద్ద ఎత్తున ఊరేగింపుగా గ్రామస్తులంతా పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నారు. వర్షాలు బాగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో వర్థిల్లేలా చూడాలని బోనాల నైవేద్యాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img