Homeహైదరాబాద్latest Newsకుత్బుల్లాపూర్ లో ఘనంగా "గురు పౌర్ణమి" వేడుకలు…

కుత్బుల్లాపూర్ లో ఘనంగా “గురు పౌర్ణమి” వేడుకలు…

ఇదే నిజం, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ లోని 130- సుభాష్ నగర్ డివిజన్ సుభాష్ నగర్, భాగ్యలక్ష్మి కాలనీలో నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకల్లో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మనిషి ప్రవర్తన, నడవడిక మంచిగా ఉండాలంటే మంచి గురువు సాంగిత్యం ఉండాలన్నారు. మన మంచి కోరి సన్మార్గాన్ని చూపే ప్రతి వ్యక్తి గురువుతో సమానమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, వేడుకల నిర్వాహకులు పోలీస్ భాస్కర్ రెడ్డి, భాగ్యలక్ష్మి కాలనీ అధ్యక్షులు సాగర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాములు యాదవ్, జయరామ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ కుంటి మల్లేష్, సీనియర్ నాయకులు బలరాం రెడ్డి, రఘు, గంగారం, దుర్గారావు, శ్రీనివాసరాజు, కోటేశ్వరరావు, అడప శేషు, శాంతం రాయ్, నరేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, నరేందర్ గౌడ్ స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img