Homeహైదరాబాద్latest Newsఅక్షర స్కూల్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా వేడుకలు

అక్షర స్కూల్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా వేడుకలు

ఇదేనిజం, ఉప్పల్: అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా వేడుకలు నిర్వహించారు. ఉప్పల్ పోచారం లోని అక్షర స్కూల్ లో యోగా దినోత్సవాన్ని నిర్వహించుకున్నామని ప్రిన్సిపాల్ స్వప్న తెలిపారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ స్వప్న మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు యోగా చేయాలని విద్యార్థులకు ఆమె సూచించారు. యోగా చేయడంతో ఎన్నో లాభాలు ఉన్నాయని ఆమె అన్నారు. యోగాతో ఒత్తిడి, డిప్రేషన్ తగ్గించుకోవచన్నారు. ఆరోగ్య సమస్యలు కుదుట పడే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ స్వప్న, టీచర్స్, డిటిపి ఆపరేటర్ దేవరకొండ శ్రీకాంత్, పీఈటీ టీచర్లు వినోద్, అడ్మిన్ స్టాఫ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img