Homeహైదరాబాద్latest Newsఘనంగా ' మధు ' జన్మదిన వేడుకలు

ఘనంగా ‘ మధు ‘ జన్మదిన వేడుకలు

ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ శాసన సభ్యులు బాలు నాయక్ యొక్క క్యాంపు కార్యాలయ డాట ఎంట్రీ ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్న మధు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు క్యాంపు ఆవరణంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కత్తిరించి శాలువాతో ఆయనను సన్మానించారు. అనంతరం యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. అనేక సుదూర ప్రాంతాల నుండి తమ పని మీద క్యాంపు కార్యాలనికి వచ్చే ప్రజలను ప్రేమతో పలకరించి తన వంతుగా వీలైన అన్ని పనులను పూర్తి చేసే గొప్ప మనసున్న మంచి మనిషని కొనియాడారు. భవిష్యత్తులో తన ఉద్యోగ అవకాశాలలో మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. భగవంతుడు తనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొర్ర రాంసింగ్ నాయక్, చింతకుంట్ల రాకేష్, ఎర్ర కృష్ణ జాంబవ్, వంగూరి వెంకటేష్, రాజు, మాజీ సర్పంచ్ శ్రీను నాయక్, కార్యాలయ సిబ్బంది అజయ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img