Homeజిల్లా వార్తలుఘనంగా రిజర్వేషన్ డే.. రిజర్వేషన్ పితామహుడు ఛత్రపతి సాహుమహారాజ్

ఘనంగా రిజర్వేషన్ డే.. రిజర్వేషన్ పితామహుడు ఛత్రపతి సాహుమహారాజ్

ఇదేనిజం, లక్షెట్టిపేట: రిజర్వేషన్ పితామహుడు ఛత్రపతి మహారాజ్ మొట్టమొదటి సారి సమానత్వంతో కూడిన పాలన అందించాడని అలిండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కో కన్వీనర్ కొల్లూరి రవి కుమార్ పేర్కొన్నారు. అలిండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రిజర్వేషన్ డే సందర్బంగా వాగేశ్వర జూనియర్ కాలేజీలో పితామహుడు ఛత్రపతి సాహు మహారాజ్ కు ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. దేశానికి అన్ని వర్గాల్లో రాజకీయ, ఆర్థిక, సామజిక రంగాల్లో సమానత్వం నేర్పిన మహనీయుడని, అయన చేసిన సేవలను కొనియాడారు. ఛత్రపతి సాహు మహారాజ్ కొల్లాపూర్ సంస్థాన రాజ్య పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ వర్గాలకు మొట్టమొదట రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన మహనీయుడన్నారు. ఆ కాలంలో మహిళలకు చదువుని ఉచిత నిర్భంద విద్య, బాల్య వివాహలను రద్దు చేస్తూ, వితంతు పునర్వివాహలను చట్ట బద్దము చేసాడన్నారు.

సాహు మహారాజ్ ను అంబేద్కర్ ఆదర్శంగా తీసుకోని ఆలోచన, ఆశయ లక్షాలను భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందన్నారు. అల్ ఇండియా గిరిజన విద్యార్థి సంఘము జాతీయధ్యక్షుడు ఇందల్ రాథోడ్, అల్ ఇండియా అంబేద్కర్ సంఘము మండల నాయకుడు దర్శనాల నవీన్ కుమార్, అంబేద్కర్ యువజన సంఘం పట్టణధ్యక్షు విక్రమ్, మంచాల కుమార్, యూత్ నాయకుడు అయిల్ల ప్రశాంత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img