ఇదే నిజం, గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో గాయత్రి విశ్వబ్రాహ్మణ సంఘాల అధ్వర్యంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతోత్సవాలు ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం రోజున ఉదయం సంఘ భవనం ఆవరణలో పతాకవిష్కరణ చేశారు. అనంతరం పూజారులు వేద మంత్రోచరణాలతో చెక్కతో తయారు చేసి ప్రతిష్టించిన శ్రీ విశ్వకర్మ విగ్రహానికి పూలమాలలతో అలంకరించి శోభయత్ర నిర్వహించారు. విశ్వకర్మను ప్రపంచంలోనే మొట్టమొదటి వాస్తుశిల్పిగా భావిస్తారని చేతివృత్తులవారు లేదా ఏదైనా యంత్రంతో పనిచేసే వ్యక్తులు పూజిస్తారన్నారు.