Homeహైదరాబాద్latest Newsమూఢనమ్మకంతో నానమ్మని చంపినా మనవడు.. ఆమె రక్తంతో శివలింగానికి అభిషేకం

మూఢనమ్మకంతో నానమ్మని చంపినా మనవడు.. ఆమె రక్తంతో శివలింగానికి అభిషేకం

ఛత్తీస్‌గఢ్ లో దారుణం జరిగింది. మూఢనమ్మకాలతో సొంత నానమ్మని చంపినా మనవడు. వివరాల్లోకి వెళితే… రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో ఓ వ్యక్తి తన నానమ్మని హత్య చేశాడు. ఇది నరబలిగా అధికారులు అనుమానిస్తున్నారు. నానమ్మని చంపి, రక్తంతో శివలింగానికి అభిషేకం చేశాడని పోలీసులు ఆదివారం తెలిపారు. శనివారం సాయంత్రం నందిని పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నన్‌కట్టి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుందని ధామ్‌ధా ఏరియా పోలీసు అధికారి సంజయ్‌ పుంధీర్‌ తెలిపారు. ఈ ఘటనపై స్థానికుల సమాచారంతో పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. బాధితురాలిని 70 ఏళ్ల రుక్మణి గోస్మామిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. గుల్షన్ గోస్వామి తన నానమ్మతో కలిసి శివాలయానికి సమీపంలోని ఓ గదిలో నివసిస్తున్నాడు. రోజూ గుడిలో పూజలు చేసేవాడు. శనివారం సాయంత్రం ఇంట్లో ఉన్న నానమ్మని త్రిశూలంతో హతమార్చి, ఆలయంలోని శివలింగంపై ఆమె రక్తాన్ని అర్పించినట్లు అధికారులు తెలిపారు. గుడి నుంచి ఇంటికి వచ్చిన అతను అదే శివలింగంతో పొడుచుకుని తీవ్రగాయాలపాలయ్యాడు. గుల్షన్‌ను రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేర్చినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.

Recent

- Advertisment -spot_img