ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలంలోని కమలాపూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల కమలపూర్ లో విధులు నిర్వహించి పదోన్నతులు మరియు బదిలీ పై వెళ్లిన శైలజ, ఆసం శ్రీనివాస్, బుగ్గారపు హరీష్, రేణుక మరియు గొల్లపల్లి గణేష్ ఉపాధ్యాయులను శనివారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కే ప్రభాకర్ రెడ్డి,ఉపాధ్యాయులు, విద్యార్థులు జ్ఞాపిక, శాలువా, పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మ్యాన పవన్ కుమార్, అసిఫ్, సూర్యతేజ పాల్గొన్నారు.