Homeహైదరాబాద్latest Newsబంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త..!

బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త..!

బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. కొన్ని రోజులుగా గరిష్ట స్థాయిలో ఉన్న బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి. బంగారం రేట్ల తగ్గుదల సామాన్యులకు కొంత ఉపశమనం కలిగించిందని చెప్పాలి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 తగ్గి రూ.81,850 గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 తగ్గి రూ.89,290కి చేరుకుంది. అదేవిధంగా వెండి ధర కూడా కిలోకు 1,10,000గా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img