It is a matter of concern that HIV is at the top of the list of highest reported cases. According to the latest figures from the National Family Planning Agency, the national average for condom use is 5.2 per cent, compared to 0.5 per cent in the state.
హెచ్‌ఐవీ కేసులు అత్యధిక నమోదవుతున్న జాబితాలో గ్రేటర్ టాప్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థ తాజా లెక్కల ప్రకారం కండోమ్‌ల వినియోగంలో జాతీయ సగటు 5.2 శాతం ఉండగా, రాష్ట్రంలో 0.5 శాతమే ఉండటమే ఇందుకు కారణం.
జాతీయ కుటుంబ నియంత్రణ సంస్థ తాజా లెక్కల ప్రకారం ఫ్యామిలీ ప్లానింగ్‌పై అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో 86.3 శాతం మందికి అవగాహన ఉంది.
కానీ కండోమ్‌ల వినియోగం మాత్రం 0.2 శాతమే. ఇక పాండిచ్చేరిలో 79.9 శాతం మందికి కుటుంబ నియంత్రణపై చైతన్యం ఉండగా, 0.8 శాతం మందే కండోమ్ వాడుతున్నారు.
గోవాలో 77.4 శాతం మందికి అవగాహన ఉండగా, వీరిలో 7.1 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు.
హర్యానాలో 71.6 శాతం మందికి అవగాహన ఉన్నప్పటికీ.. 12 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు.
ఉత్తరాఖండ్‌లో 65.3 శాతం మందికి అవగాహన ఉండగా, ఇక్కడ అత్యధికంగా 16.1 శాతం మంది కండోమ్‌లను వినియోగిస్తున్నారు.
తమిళనాడులో 64.7 శాతం మందికి అవగాహన ఉండగా, 0.8 శాతం మంది మాత్రమే కండోమ్ వాడుతున్నారు.
సిక్కింలో 62.7 శాతం మందికి చైతన్యం కలిగి ఉండగా, వీరిలో 5.2 శాతం మందే కండోమ్‌లను వాడుతున్నట్లు తేలింది.
త్రిపురలో 57.6 శాతం మందికి అవగాహన ఉండగా, వీరిలో 1.9 శాతం మంది కండోమ్ వాడుతున్నారు.
ఇక తెలంగాణలో 67 శాతం మందికి పరిజ్ఞానం కలిగి ఉండగా, వీరిలో 0.5 శాతం మందే కండోమ్ వాడుతున్నట్లు స్పష్టమైంది.