Homeహైదరాబాద్latest Newsఅధికారం పోగానే అటకెక్కిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. అధికారం ఉంటేనే చెట్ల మీద పేమ గుర్తొస్తుందా..?

అధికారం పోగానే అటకెక్కిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. అధికారం ఉంటేనే చెట్ల మీద పేమ గుర్తొస్తుందా..?

భారీ వర్షాల కారణంగా మేడారం ఫారెస్ట్‌లో సుమారు లక్ష చెట్లు కూలిపోవడంతో ఊహకు అందనంతగా విషాదం నెలకొందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఎక్స్‌లో ట్వీట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే దీనిపై కొందరు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధికారం ఉంటేనే చెట్ల మీద ప్రేమ గుర్తొస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. అధికారం పోగానే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అటకెక్కిందని, బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇప్పుడు అస్సలే కనిపించట్లేదని, రోజుకో ప్రోగ్రాం..సెలబ్రిటీలతో ఛాలెంజ్ లు.. ఇలా ఫుల్ పబ్లిసిటీ తో నడిచిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇప్పుడెందుకు కొనసాగట్లేదని ప్రశ్నిస్తున్నారు. నిజంగా చెట్ల మీద ప్రేముంటే..అధికారం లేకున్నా చెట్లు పెంచొచ్చు కదా అని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పై నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img