Homeజిల్లా వార్తలుశ్రీ చైతన్య స్కూల్ లో గ్రీన్ ఇండియా మిషన్ ప్రోగ్రాం.. మొక్కలు నాటిన విద్యార్థులు, ఉపాధ్యాయులు..

శ్రీ చైతన్య స్కూల్ లో గ్రీన్ ఇండియా మిషన్ ప్రోగ్రాం.. మొక్కలు నాటిన విద్యార్థులు, ఉపాధ్యాయులు..

ఇదేనిజం, శేరిలింగంపల్లి: వాతావరణంలో వస్తున్న గ్లోబల్ వార్మింగ్ ను నివారించడానికి దేశవ్యాప్తంగా గోగ్రీన్ ఇండియా మిషన్ ప్రోగ్రాం నడుస్తుంది. అందులో భాగంగా శేరిలింగంపల్లి మండల పరిధిలోనీ నల్లగండ్ల లోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పాత్రికేయుడు, టి జే ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పి. నర్సింలు విచ్చేశారు. ఈ సందర్బంగా అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమోంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ట్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్, చెట్ల పెంపకం పై అవగాహన కలిగేలా ర్యాలీ కార్యక్రమం నిర్వహించి, చెట్ల పెంపకం వల్ల కలిగే లాభాలను విద్యార్థులకు వివరించారు. విద్యతో పాటు విద్యార్థులకు సామజిక స్పృహ, సమాజం పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నర్సింలు సూచించాడు. ఈ కార్యక్రమంలో డీన్ నాగరాజు, సీ.బ్యాచ్ ఇంచార్జ్ శ్రీలక్ష్మి, తెలుగు శాఖ హెచ్. ఓ. డి. రంగ. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img