Homeహైదరాబాద్latest Newsదళితుల మధ్యల చిచ్చు పెట్టేందుకే ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. దీన్ని వెంటనే రద్దు...

దళితుల మధ్యల చిచ్చు పెట్టేందుకే ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. దీన్ని వెంటనే రద్దు చేయాలి

  • ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా నాయకులు డిమాండ్

ఇదేనిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ ఇచ్చిన దేశ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఒక రోజు ముందే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు బందుకు సహకరించాలని వాణిజ్య వ్యాపార సంస్థలతోపాటు, హోటల్లు ఇతర యజమానులను కోరారు. దీంతో నేటి ఉదయం నుండి దుకాణాలు పలు వ్యాపార సంస్థలు మూసివేశారు. దీంతో మండల కేంద్రంలో బందు విజయవంతంగా సాగింది. అనంతరం రాజీవ్ చౌక్ వద్ద జిల్లా మండల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం దళితుల మధ్యన కోసమే వర్గీకరణ బిల్లును ఆమోదించాలని వెల్లడించారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన ప్రకారమే వర్గీకరణ చేయాలి తప్ప కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల కోసమే ఇటి వర్గీకరణ చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మాలలు ఉపకులాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని వెల్లడించారు. తక్షణమే ఎస్సీ వర్గీకరణ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఒక్కరోజు బందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img