Homeలైఫ్‌స్టైల్‌Green Tea Benefits : గ్రీన్‌టీతో ఆరోగ్యం.. దీర్ఘాయిష్షు.. బ‌రువూ త‌గ్గొచ్చు

Green Tea Benefits : గ్రీన్‌టీతో ఆరోగ్యం.. దీర్ఘాయిష్షు.. బ‌రువూ త‌గ్గొచ్చు

Green Tea Benefits : గ్రీన్‌టీతో ఆరోగ్యం.. దీర్ఘాయిష్షు.. బ‌రువూ త‌గ్గొచ్చు

Green Tea Benefits – వ్యాధులు ద‌రిచేర‌కుండా దీర్ఘ‌కాలం ఆరోగ్యంతో జీవించాల‌ని కోరుకోని వారుండ‌రు.

మ‌నం తీసుకునే ఆహారం, శారీర‌క వ్యాయామం వంటి అంశాలే మ‌న ఆరోగ్యం, జీవ‌నకాలాన్నినిర్ధేశిస్తాయ‌ని నిపుణులు చెబుతుంటారు.

దీర్ఘ‌కాలం బ‌త‌క‌డమ‌నేది మ‌న చేతుల్లో లేక‌పోయినా ఆరోగ్య‌క‌ర‌మైన అల‌వాట్ల‌తో వ్యాధుల‌కు దూరంగా దీర్ఘాయువును సొంతం చేసుకోవ‌చ్చ‌ని ప‌లు అధ్య‌య‌నాలు వెల్ల‌డించాయి.

ఆరోగ్య‌క‌ర ఆహారం, పానీయాల‌ను త‌గు మోతాదులో త‌ర‌చూ తీసుకోవ‌డం, శారీర‌క వ్యాయామం, త‌గినంత నిద్ర‌, మ‌ద్య‌పానానికి, ధూమ‌పానానికి దూరం కావడం, న‌లుగురితో క‌లివిడిగా ఉండ‌టం వంటి అల‌వాట్ల‌తో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దీర్ఘ‌కాలం జీవించ‌వ‌చ్చ‌ని ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డిస్తున్నాయి.

ఇక గ్రీన్‌టీతో దీర్ఘాయువు సొంతం చేసుకోవ‌చ్చ‌ని తాజా ప‌రిశోధ‌న స్ప‌ష్టం చేసింది.

గ్రీన్‌టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పాలీపెనాల్స్ శ‌రీరానికి మేలు చేకూరుస్తాయి.

శ‌రీరాన్ని చురుకుగా చేయ‌డంతో పాటు కీల‌క అవ‌యవాలు, శారీర‌క‌, మానసిక ఉల్లాసానికి గ్రీన్ టీ ఉప‌క‌రిస్తుంద‌ని అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది.

గ్రీన్ టీ రోజూ సేవిస్తే చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డ‌ట‌మే కాకుండా బ‌రువు త‌గ్గ‌డం, గుండె జ‌బ్బుల ముప్పును నివారించ‌వ‌చ్చు. గ్రీన్ టీ అన్ఆక్సిడైజ్డ్ ఆకుల నుంచి త‌యార‌వ‌డం మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

గ్రీన్ టీ తీసుకోవ‌డం ద్వారా గుండె జ‌బ్బుల ముప్పు గ‌ణ‌నీయంగా త‌గ్గంద‌ని జ‌ర్న‌ల్ ఆఫ్ అమెరిక‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్‌లో ప్ర‌చురిత‌మైన ఒషాకి అధ్య‌య‌నం వెల్ల‌డించింది.

40-79 ఏండ్ల వ‌య‌సు వారిపై 11 ఏండ్ల పాటు నిర్వ‌హించిన ప‌రిశోధ‌న‌లో ఈ వివ‌రాలు వెలుగుచూశాయి.

40,000 మంది జ‌ప‌నీయుల‌పై జ‌రిగిన ఈ అధ్య‌య‌నం రోజుకు ఐదు క‌ప్పుల గ్రీన్ టీ తాగిన వారిలో గుండె జబ్బుల‌తో మ‌ర‌ణాల రేటు త‌క్కువ‌గా ఉన్న‌ట్టు గుర్తించారు.

ఇవి కూడా చ‌ద‌వండి

ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలంటే..

రాత్రి 10 గంటల్లోపే నిద్రపోతేనే గుండె పదిలం..

నెయ్యితో నొప్పులన్నీ పరార్.. ఇంకా ఎన్ని లాభాలో తెలుసా..

వచ్చే ఏడాదికల్లా సాధారణ జలుబుగా కరోనా

Recent

- Advertisment -spot_img