Homeలైఫ్‌స్టైల్‌ఆ టైంలో గ్రీన్‌టీ తాగితే.. చాలా డేంజర్‌

ఆ టైంలో గ్రీన్‌టీ తాగితే.. చాలా డేంజర్‌

వారానికి మూడు సార్లు గ్రీన్‌ టీ తాగితే అందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌తో మనిషి జీవితకాలం పెరగడంతో పాటు గుండెపోటు, స్ర్టోక్‌ ముప్పులను నివారించవచ్చని ఎన్నో అధ్యయాలు స్పష్టం చేశాయి.

ఇన్నిప్రయోజనాలు ఉన్న గ్రీన్​ టీని కొన్ని సమయాల్లో తీసుకుంటే ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు.


ఖాళీ కడుపుతో వద్దు

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్‌ టీ తాగితే పలు అనారోగ్య సమస్యలకు దారితీస్తోందని నిపుణులు చెప్పారు.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌, పాలీఫినాల్స్‌ గ్యాస్ట్రిక్ యాసిడ్‌లను ప్రేరేపించడం కారణంగా జీర్ణక్రియ సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.

ఉదయాన టిఫిన్‌ చేశాక గ్రీన్‌టీని సేవించడం ఆరోగ్యకరమని వైద్యులు తెలిపారు.


నిద్రలేమి సమస్యలు


రాత్రి పడుకునే ముందు గ్రీన్‌ టీని సేవిస్తే నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి.

గ్రీన్​ టీలో ఉండే కెఫిన్​ నిద్ర ప్రేరేపిత మెలటోనిన్​ రిలీజ్​ని అడ్డుకోవడంతో నిద్రలేమి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.


జీర్ణకక్రియ సమస్యలు


జీర్ణక్రియకు గ్రీన్​ టీ మేలు చేస్తోంది. కానీ భోజనం చేసిన వెంటనే గ్రీన్​ టీ తాగితే అది జీర్ణక్రియ ప్రభావితం అవుతుంది.

భోజనం నుంచి లభించే పోషక వలువలు తగ్గి, పోషకాహార లోప సమస్యలు తలెత్తె అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.


అసిడిటీ ప్రాబ్లమ్స్


గ్రీన్‌టీతో మందులు వేసుకుంటే ఆరోగ్యానికి హానికరం.

మందులలో ఉండే కెమికల్స్‌ గ్రీన్‌ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌తో కలిసిన క్రమంలో అసిడిటీ సమస్యలు తలెత్తె ప్రమాదం ఉంది.

Recent

- Advertisment -spot_img