HomeతెలంగాణGROUP 1:గ్రూప్ 1 ఫలితాలపై స్టే

GROUP 1:గ్రూప్ 1 ఫలితాలపై స్టే

ఇదేనిజం, హైదరాబాద్: గ్రూప్ 1 ఫలితాలపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించే వరకూ ఫలితాలు రిలీజ్ చేయొద్దని ఆదేశించింది. ధర్మాసనం ఆదేశానుసారం తాము ఫలితాలను విడుదల చేయబోమని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో నేడు (జూలై 25) విచారణ జరిగింది. దీనికి సంబంధించిన పిటిషన్‌పై టీఎస్‌పీఎస్‌సీ కౌంటర్ దాఖలు చేసింది. వాదనలు వినిపించేందుకు వచ్చే సోమవారం వరకు సమయం ఇవ్వాలని హైకోర్టును టీఎస్పీఎస్సీ ధర్మాసనాన్ని కోరింది. సోమవారం అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తారని.. అప్పటివరకు గ్రూప్‌-1 ఫలితాలు ప్రకటించబోమని హైకోర్టుకు తెలిపింది. దీంతో తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

Recent

- Advertisment -spot_img