Homeహైదరాబాద్latest Newsఅశోక్‌నగర్‌లో మరోసారి ఆందోళనకు దిగిన గ్రూప్‌-1 అభ్యర్థులు

అశోక్‌నగర్‌లో మరోసారి ఆందోళనకు దిగిన గ్రూప్‌-1 అభ్యర్థులు

అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నేపథ్యంలో.. అశోక్‌నగర్‌లో గ్రూప్‌-1 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-1 అభ్యర్థులు ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని బలవంతంగా వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 29ని రద్దు చేయాలని గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తీర్పు వెలువడే వరకు గ్రూప్-1 మెయిన్స్‌ను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.అయితే పరీక్షల నిర్వహణకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. అశోక్‌నగర్‌లో గ్రూప్‌-1 అభ్యర్థులు ఇప్పటికే ఆందోళనకు దిగారు. అయితే మరోసారి గ్రూప్‌-1 అభ్యర్థులు అశోక్‌నగర్‌లో ఆందోళనకు దిగారు.

Recent

- Advertisment -spot_img