Group 1 : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్‌కు లైన్ క్లియర్ అయింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీఓ 29 చెల్లుబాటును సవాల్ చేస్తూ గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా దీనిపై విచారణ జరిపిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు రిజర్వేషన్లకు సంబంధించి 2022లో జారీ చేసిన జీఓ 55ను సవరిస్తూ ఫిబ్రవరి 28న జీవో 29ని జారీ చేసింది. దీనిని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్ 1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇటీవల పిటిషన్ కొట్టివేయడంతో, గ్రూప్ 1 నియామకంలో ఉన్న అడ్డంకి తొలగిపోయింది. TGPSC ఇప్పటికే గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేసింది. త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది.