Group-1 : గ్రూప్-1 నియామకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్-1లో అవకతవకలు జరిగాయని 20 పిటిషన్లు దాఖలు అయ్యాయి. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తుది తీర్పు వెలువడే వరకు పోస్టింగ్‌లు ఇవ్వొద్దన్న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.