గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లను టీజీపీఎస్సీ నేడు విడుదల చేసింది. హాల్ టికెట్లను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 21 ఉదయం వరకు హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. హైదరాబాద్(హెచ్‌ఎండీఏతో సహా) పరిధిలో అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు TGPSC యొక్క అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ నుండి TGPSC గ్రూప్ 1 మెయిన్స్ హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.