Gujarat : గుజరాత్ లోని (Gujarat) కచ్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కేరా ముంద్రారోడ్డులో ప్రైవేట్ బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో 9 మంది మృతి చెందారు. ఈ ఘటనలో 30 మందికి పైగా గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.