Homeహైదరాబాద్latest NewsGujarat Titans : ఆదరగొట్టిన జోస్ బట్లర్.. ఢిల్లీపై గుజరాత్ ఘన విజయం

Gujarat Titans : ఆదరగొట్టిన జోస్ బట్లర్.. ఢిల్లీపై గుజరాత్ ఘన విజయం

Gujarat Titans : ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నేడు నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీపై 7 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. దీంతో భారీ లక్ష్యంతో బరిలో దిగిన నిర్ణత 19.2 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లు లో జోస్ బట్లర్ 97 పరుగులు చేసాడు. అలాగే సాయి సుదర్శన్ 36, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 43, రాహుల్ తెవాటియా 11, శుభ్‌మాన్ గిల్ 7 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లు ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఒక్కొక్క వికెట్ తీశారు. ఈ విజయంతో గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.

Recent

- Advertisment -spot_img