Homeహైదరాబాద్latest Newsజగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరడాన్ని నిరసిస్తూ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన గులాబి...

జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరడాన్ని నిరసిస్తూ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన గులాబి నేతలు.

ఇదే నిజం ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎద్దెండి నర్సింహ్మ రెడ్డి అధ్యక్షతన బిఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం రాత్రి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఖండిస్తూ ఆయన దిష్టి బొమ్మను దహనం చేశారు. గుట్టు చప్పుడు కాకుండా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంలో ఆంతర్యమేంటో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుపాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కావస్తున్న ఇచ్చిన హమీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడంలో ముందుస్థాయిలో ఉందని ఆరోపించారు. ఒక్కరిద్దరూ ఎమ్మెల్యేలు పార్టీ మారినంతనా బీఆర్ఎస్ కు ఒరిగేదిఎమిలేదన్నారు. రానున్నది కేసీఆర్ ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ పార్టీ అధ్యక్షులు కొమ్ము బాలయ్య, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఉల్లి యాదిమల్లేశ్, నాయకులు చెవుల మల్లేశ్ యాదవ్, విద్యార్థి విభాగం మండలాధ్యక్షులు నవాజ్, నాయకులు శీలం స్వామి, ముక్క మల్లయ్య, దోరగల్ల బాలయ్య, కంచం నర్సింలు, భరత్, శరయ్య, మనోహర్, నవీన్, సతీష్, ఘణి తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img