న్యూఢిల్లీః కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించకుండా ఇలాగే కొనసాగితే రాబోయే 50 ఏండ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వస్తదని ఆ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యనించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పార్టీలోని సీనియర్లు రాసిన లేఖపై దుమారం చెలరేగడంతో లేఖ రాసిన వారిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మరోవర్గం సీనియర్ నేతలు బాహాటంగానే పేర్కొంటున్నారు. తాజాగా దీనిపై ఆజాద్ స్పందించారు. నిజమైన కాంగ్రెస్ వాదులు అధిష్ఠానానికి లేఖ రాయడాన్ని సమర్థిస్తారంటూ పేర్కొన్నారు. పార్టీ అంతర్గతంగా ఎన్నికలు నిర్వహించే ఏవరికైనా పార్టీ పదవులకు ఎన్నుకోవాలి, కానీ ప్రస్తుతం కాంగ్రెస్‌లో కనీసం ఒక్కశాతం కార్యకర్తల మద్దతు లేని వారు కూడా పార్టీ పదవులకు ఎన్నికవుతున్నారని చురకలంటించారు. పార్టీలో ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఎవరి మద్దతు లేకపోయిన పార్టీ ప్రెసిడెంట్‌గా ఎన్నిక కావచ్చని, సీడబ్ల్యూసీలోకి ఎన్నికైన వారిని తొలగించే నిబంధన ప్రస్తుతం లేదన్నారు. ఇలాంటి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయాలని లేఖ రాస్తే దాన్ని కూడా తప్పపట్టడం సరికాదన్నారు.