– కామారెడ్డికి భారీగా పరిశ్రమలు తీసుకొస్తాం
– పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
ఇదేనిజం, కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే గల్ఫ్ కార్మికులకు సంక్షేమ బోర్డు తీసుకొస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన కార్మికులకు ఇతర దేశాల్లో అన్యాయం జరిగితే న్యాయం చేసేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి ఆదుకుంటామని చెప్పారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అవకాశమిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. కామారెడ్డికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ, నేను తీసుకుంటాం. కేసీఆర్ ఇచ్చే రూ.10వేలకు ఆశపడి ఓటు వేయొద్దు. ఆయన గెలిస్తే కామారెడ్డిలో రూ.వేలకోట్ల విలువైన భూములు కబ్జా చేస్తారు. రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వని కేసీఆర్‌కు ఎందుకు ఓటేయాలి?’ అంటూ రేవంత్ పిలుపునిచ్చారు.