HomeసినిమాGuntur Karam : Youtube ​ను షేక్​ చేస్తున్న ‘దమ్ మసాలా’

Guntur Karam : Youtube ​ను షేక్​ చేస్తున్న ‘దమ్ మసాలా’

సూపర్ స్టార్ మహేశ్​ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటరటైనర్ గుంటూరు కారం. రెండ్రోజుల కిందట రిలీజైన ఈ మూవీకి సంబంధించి ‘దమ్ మసాలా’సాంగ్​ను మేకర్స్ యూట్యూబ్​లో రిలీజ్ చేశారు. 24 గంటల్లోనే 19.2 మిలియన్ల వ్యూస్​ సొంతం చేసుకున్న ఈ సాంగ్ టాలీవుడ్​లో ఫస్ట్ డే అత్యధిక వ్యూస్​ అందుకున్న పాటగా నిలిచింది. మహేశ్​ క్రేజ్, చరిష్మాకి తగ్గట్లుగా రామజోగయ్య శాస్రి రాసిన పవర్​ ఫుల్ లిరిక్స్​కు థమన్ మెస్మరైజింగ్ ట్యూన్​ను అందించారు. యూత్​, మాస్​తో పాటు అన్ని వర్గాల ఆడియెన్స్​ను అద్భుతంగా అలరిస్తున్న ఈ సాంగ్ యూట్యూబ్​ను షేక్ చేస్తోందంటూ మహేశ్​ ఫ్యాన్స్ సంబురపడిపోతున్నారు. షూటింగ్ మొదలైనప్పటి నుంచి అందరిలో భారీ స్థాయి అంచనాలు పెంచేసిన గుంటూరు కారం మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్​పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img