Homeహైదరాబాద్latest NewsGuru Purnima 2024: గురుపౌర్ణమి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..? గురు పౌర్ణమి ప్రత్యేకతేంటంటే..?

Guru Purnima 2024: గురుపౌర్ణమి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..? గురు పౌర్ణమి ప్రత్యేకతేంటంటే..?

Guru Purnima 2024: వ్యాస పూర్ణిమ అని పిలువబడే గురు పూర్ణిమ.. ఆషాఢ పూర్ణిమ రోజున జరుపుకుంటారు. ఈ రోజు నాలుగు వేదాలను రచించిన వేదవ్యాస మహర్షి జన్మదినం. చాలా మంది ఈ రోజున గురువుకు నమస్కరిస్తారు. ఆధ్యాత్మిక సంప్రదాయాలలో కూడా ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది. మనకు జ్ఞానాన్ని అందించిన గురువులు, ఆధ్యాత్మిక గురువులు, మార్గదర్శకులకు గౌరవం ఇచ్చే సమయం గురుపూర్ణిమ. ఈ సంవత్సరం, గురు పూర్ణిమ వ్రతాన్ని ఆదివారం, జూలై 21, 2024 నాడు జరుపుకుంటారు.

గురువు అంటే అర్థం..
ఇక్కడ గురు అంటే.. సంస్కృతంలో ‘గు’ అనే శబ్దానికి చీకటి అని అర్థం. ‘రు’ అంటే నాశనం చేసే తేజస్సు అని అర్ధం. అజ్ఞానం అనే చీకటిని.. తొలగించి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించేవాడే గురువని అర్ధం. మన గమ్యానికి దారి చూపించేవాడే గురువు. మనకు తెలియని విషయాలను చెప్తూ.. అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానసంపన్నుడు, గుణసంపన్నుడుగా గురువు ఉంటాడు. ముఖ్యంగా చదువు, జ్ఞానంతో పాటు ఏ దారిలో నడివాలి, ఏ గమ్యం వైపు నడిపించాలో గురువే మార్గదర్శిగా నిలుస్తాడు.

గురు పౌర్ణమి ప్రత్యేకత ఇదే..
హిందువులు జరుపుకునే పండుగలలో గురు పౌర్ణమికి ఓ ప్రత్యేకత ఉంది. ఆషాడ మాస శుక్లపక్ష పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు. గురు సామానులైన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుటయే ఈ గురు పౌర్ణమి ముఖ్య ఉద్దేశం. బ్రహ్మ,విష్ణు,మహేశ్వర త్రిమూర్తి స్వరూపమే గురువు అని అర్థం. గురువుల్లో మొదటగా వ్యాస భగవానుడు ఉద్భవించాడు అందుకే వ్యాస పూర్ణిమ, గురుపూర్ణిమ అని అంటుంటారు. అయితే మొదటగా ఆదిశంకరాచార్యులు గురుపరంపరలో వస్తే ఆరాధించిన వారు చాలామంది ఉన్నారు.

Recent

- Advertisment -spot_img