ఇదే నిజం దేవరకొండ: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో గురువారం రోజున కొండ భీమనపల్లి పరిధిలో ఉన్నటువంటి కోల్ ముంతలపాడు బీ సీ మహాత్మ జ్యోతిరావు పూలే ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఈనెల 26వ తేదీ సోమవారం రోజున 13 మంది విద్యార్థులను ఎలుకలు కరువగా అక్కడ ఉన్న పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది ఈ విషయాన్ని బయటకు రాకుండా కప్పిపుచ్చే విధంగా పాఠశాల యాజమాన్యం వ్యవరించడంతో ఏబీవీపీ కార్యకర్తలు అక్కడికి వెళ్ళగా పాఠశాల లోనికి రాకుండా అడ్డుకోవడంతో గేటు ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యలమల గోపీచంద్ మాట్లాడుతూ కోల్ ముందలపాడు బీ సీ మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థులకు 26వ తేదీన ఎలకలు కరవగా ఈరోజు వరకు ఈ విషయాన్ని కప్పిపుచ్చే విధంగా ఈ యొక్క పాఠశాల యాజమాన్యం అనేది ప్రయత్నం చేస్తుంది ఇందులో ఈ యొక్క సంఘటన చోటు చేసుకోవడానికి గురుకుల పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే జరిగింది పాఠశాలలో ఉన్న సమస్యలు బయటకు రాకుండా విద్యార్థులను బెదిరిస్తూ విద్యార్థుల సమస్యలను తెలుసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఈ యొక్క పాఠశాల ప్రిన్సిపల్ సాగర్ ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు యొక్క సమస్యలు తెలుసుకోవడానికి పాఠశాల వద్దకు వెళ్లగా లోపటికి రానివ్వకుండా గేటుకు తాళం వేసి లోనికి రాకుండా పాఠశాల యాజమాన్యం అడ్డుకోవడంతో పాఠశాల గేటు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం ద్వారా పాఠశాల లోనికి వెళ్లి ఎలుకలు కరిచిన 13 మంది విద్యార్థులను పరమశించి వారితో మాట్లాడగా వారి సమస్యలను తెలుసుకొగా ఈ యొక్క పాఠశాల గదులలో అపరిశుభ్రంగా ఉండడంతో మరియు పాఠశాల పరిసర ప్రాంతాలలో చెత్త, చెట్లు ఉండడంవల్ల పాములు,తేళ్లు, పురుగులు వస్తాయని వారు చెప్పుతున్నారు.ఇప్పటికైనా ఈ సమస్యలపై జిల్లా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు లేనిచో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. కార్యక్రమంలో నగర జాయింట్ సెక్రెటరీ అంకురి శ్రీకాంత్, విక్రమ్, వినయ్, అనిల్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.