Gurumurthy : హైదరాబాద్ మీర్‌పేట్ హత్య కేసు నిందితుడు గురుమూర్తిని (Gurumurthy) పోలీసులు అరెస్టు చేశారు. అతడిని ఇంటికి తీసుకెళ్లి సీన్ రికన్స్ట్రక్షన్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. గురుమూర్తిలో ఏ మాత్రం పశ్చాతాపం లేదు అని రాచకొండ సీపీ తెలిపారు. ఇంత కౄరంగా హత్య చేస్తారా అని విస్తుపోయాం అని అన్నారు. పోలీసులు వివరాలు ప్రకారం.. గురుమూర్తి దంపతులు ప్రకాశం జిల్లా నుంచి వచ్చి జిల్లెలగూడలో నివాసం ఉంటున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో దంపతుల మధ్య గొడవ జరిగింది. గురుమూర్తి ప్లాన్ ప్రకారమే పిల్లలను బంధువుల ఇంట్లో ఉంచాడు అని పేర్కొన్నారు. గురుమూర్తి ఉద్దేశపూర్వకంగానే మాధవితో గొడవ పెట్టుకొని కొట్టాడు. అలాగే గోడకేసి కొట్టి, గొంతు నులిమి చంపాడు అని తెలిపారు. ఆమె మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా చేసి కుక్కర్ లో ఉడికించాడు. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని పొడిగా మర్చి, ఆ బూడిదను పెయింట్ బకెట్‌లో పెట్టుకొని చెరువులో పోసి వచ్చాడు. చంపినట్లు భౌతిక ఆధారాలు లేకుంటే కేసు నుంచి తప్పించుకోవచ్చని భావించాడు అని పోలీసుల పేర్కొన్నారు.ఈ కేసులో సాంకేతిక ఆధారాలు అన్నీ సీజ్ చేశాం అని సీపీ సుధీర్ బాబు తెలిపారు.