వాషింగ్టన్: హెచ్-1బీ వీసాల జారీని ఈ ఏడాది చివరి వరకూ రద్దుచేసిన ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ భారతీయులు దాఖలుచేసిన పిటిషన్‌ను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి అమిత్ మెహతా తిరస్కరించారు. ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేస్తామని భారతీయుల తరపు న్యాయవాదులు వెల్లడించారు. వర్క్ వీసాపై అగ్రరాజ్యంలో ఉంటూ ఇటీవలే భారత్‌కు తిరిగి వచ్చిన 169 మంది భారతీయులు, ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అమెరికా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. వీసా నిషేధాజ్ఞ ఏకపక్షమైనదని, నిలకడలేనిదని ఆరోపించారు. వీసా రద్దును ఎత్తివేయాల్సిందిగా ఆదేశించాలని, వీసా ప్రక్రియను తిరిగి పునరుద్ధరించాలని అభ్యర్ధించారు. అమెరికాలో ఉపాధి పొందేందుకు వీలు కల్పించే హెచ్-1బీ వీసాల జారీని నిలిపివేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ 22న నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
హెచ్-1బీ వీసా కేసులో భారతీయుల పిటిషన్ తిరస్కరణ
RELATED ARTICLES