Half Day Schools: విద్యార్థులకు శుభవార్త.. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రభుత్వం ఒంటిపూట బడుల షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎయిడెడ్, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు స్కూళ్లలో ఈ టైమింగ్స్ కొనసాగుతాయని తెలుస్తుంది.