తెలంగాణ విద్యాశాఖ ఒంటిపూట బడుల(Half day schools)పై కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నెలలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది.
- ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులు నిర్వహించనున్నారు.
- ఉదయం 8 గం. నుంచి మధ్యాహ్నం 12:30 గం. వరకు తరగతులు జరగనున్నాయి.
- 10వ తరగతి పరీక్షలు జరిగే కేంద్రాల్లో మాత్రం మధ్యాహ్నం తరగతులు నిర్వహించనున్నారు.