Homeహైదరాబాద్latest Newsమరమ్మత్తులకు నోచుకోని చేతి పంపులు..పట్టించుకోని అధికారులు

మరమ్మత్తులకు నోచుకోని చేతి పంపులు..పట్టించుకోని అధికారులు

ఇదేనిజం, కంగ్టి: చేతి పంపులు నిరుపయోగంగా ఉన్నాయి. సంవత్స రాలు గడిచిన మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో తాగు నీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారు. అప్పట్లో ప్రజల దాహాన్ని తీర్చేందుకు గ్రామీణ ప్రాంతాలలో నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో చేతిపంపులు ఏర్పాటు చేశారు. చేతిపంపుల ద్వారా ప్రజలకు కొంతవరకు నీటి సమస్య తీరేది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంగ్టి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ప్రజలకు నీళ్లు కావాలంటే చేతి పంపు ఆసరాగా ఉండేవి. అవి పోయాయని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోలేదని కాలనీ వాసులు తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే కంగ్టి గ్రామంలో ఉన్న చేతి పంపులను మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తేవాలని కంగ్టి గ్రమస్తుడు కిష్టప్ప, గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img