Homeస్పోర్ట్స్Team India : హనుమ విహారి బెంచ్ కే పరిమిత‌మా

Team India : హనుమ విహారి బెంచ్ కే పరిమిత‌మా

Team India : హనుమ విహారి బెంచ్ కే పరిమిత‌మా

Team India : ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా డిసెంబర్ 26వ తేదీ నుంచి టెస్ట్ సిరీస్ ఆడబోతుంది.

ఈ క్రమంలోనే టెస్టులో విజయం సాధించి శుభారంభం చేయాలి అని టీమిండియా భావిస్తోంది..

ఈ క్రమంలోనే ఎంతో పదునైన వ్యూహాలతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది టీమిండియా.

ప్రస్తుతం ప్రాక్టీస్ లో మునిగి తేలుతుంది.. అయితే ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా పర్యటన కోసం సెలెక్ట్ అయిన ఆటగాళ్లందరూ కూడా మంచి ఫామ్ లో కొనసాగుతుండడం గమనార్హం.

దీంతో తుది జట్టులో ఎవరిని ఎంపిక చేయాలి అనేది అతి పెద్ద తలనొప్పిగా మారిపోయింది.

ముఖ్యంగా టీమిండియాలో ఓపెనర్లు మిడిలార్డర్ బ్యాట్స్మెన్లను సెలెక్ట్ చేయడం కష్టంగా మారిపోయింది అన్నది తెలుస్తుంది.

మిడిలార్డర్లో రెండు స్థానాల కోసం ముగ్గురు ఆటగాళ్లు పోటీపడుతున్నారు.

Lawyer Ban : ఆన్‌లైన్​లో వాదనలు.. మర్చిపోయి మహిళతో సరసాలు.. ఐపాయ్​

Private Part Cut : అచ్చం ఉప్పెన సినిమా లాంటా ఘటన

Bombay High Court : శారీర‌కంగా క‌లిసినా పెళ్లి చేసుకోన‌వ‌స‌రం లేదు

అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి పోటీలో ఉన్నారు.

అయితే అజింక్య రహానే భారత్లో జరిగిన టెస్టులో పేలవ ప్రదర్శన చేసినప్పటికీ విదేశాల్లో అతనికి మంచి రికార్డు ఉండడంతో తుది జట్టులోకి ఎంపిక చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో అరంగేట్రం మ్యాచ్లోనే అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్ కు కూడా అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది..

అయితే హనుమ విహారి మాత్రం బెంచ్ కే పరిమితమయ్యే అవకాశం ఉందని టాక్..

అదే సమయంలో అటు కొంతమంది మాజీ క్రికెటర్లు సౌత్ఆఫ్రికా పర్యటనలో మొదటి టెస్టు మ్యాచ్లో భారత తుది జట్టులో అవకాశం తగ్గించుకునే ఆటగాళ్లు ఎవరు అనే దానిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మయాంక్ అగర్వాల్ కె.ఎల్.రాహుల్ లను ఓపెనర్లు గా అవకాశం ఇచ్చాడు వసీం జాఫర్.

చటేశ్వర్ పుజారా కు తన జట్టు లో మూడవ స్థానాన్ని కల్పించాడు.

నాలుగవ స్థానంలో విరాట్ కోహ్లీ, 5వ స్థానంలో అజింక్యా రహనే, ఆరో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ లను ఎంపిక చేయగా వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ను సెలెక్ట్ చేసుకున్నాడు.

ఇక జట్టులోకి ఒకే ఒక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ఎంచుకోవడం గమనార్హం.

Micro plastics in Drinking Water : మీరు తాగే నీటిలో మైక్రోప్లాస్టిక్స్..

Solar Tsunami : భూమికి పొంచి ఉన్న సౌర తుఫాను ప్ర‌మాదం

Indian Citizenship : భారత పౌరసత్వం కోసం వేలల్లో పాకిస్థానీ దరఖాస్తులు

బౌలర్ల కోటాలో షమి, జస్ప్రిత్ బూమ్రా మహమ్మద్ సిరాజ్ లను ఎంపిక చేసుకున్నాడు.

వసీం జాఫర్ జట్టులో హనుమ విహారి కి చోటు దక్కకపోవడం గమనార్హం.

వసీం జాఫర్ ఎంపిక చేసుకున్న జట్టు ఇలా ఉంది : మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

Recent

- Advertisment -spot_img