ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ 54 వ జన్మదిన వేడుకలు రాజీవ్ గాంధీ విగ్రహం ముందర కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జెడ్పిటిసి గుండం నరసయ్య మాట్లాడుతూ అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ హాత్ సే హాత్ జోడయాత్ర భారతదేశ వ్యాప్తంగా చేసి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చారు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ముచ్చటలు పట్టించేలా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ దేశ ప్రజల అభ్యున్నతికి పోరాడుతున్న ఈ దేశానికి కాబోయే బావి భారత ప్రధాని రాహుల్ గాంధీ కొనియాడారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి గుండం నరసయ్య పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఎంపీటీసీల శ్రీనివాస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తలారి నర్సింలు. సద్ది మధు. పెద్దిగారి శ్రీనివాస్. తోట ధర్మేందర్ , షాదుల్ పాప .శీల ప్రశాంత్ , ఉచిడి బాల్రెడ్డి , కొండం రాజిరెడ్డి, కుక్కల దేవేందర్ , వెంకటరమణ రెడ్డి. రామ్ రెడ్డి. కర్ణాకర్ , శ్రీనివాస్ రెడ్డి, రంజాన్ నరేష్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.