సీరియల్ నటిని వేధింపులకు గురి చేసిన ఓ వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మహిళ సీరియల్స్‌లో నటిస్తూ యూసఫ్‌గూడ కృష్ణానగర్‌లో నివాసముంటుంది. పెళ్లికి ఒప్పుకోలేదనే కోపంతో ఫణితేజ అనే వ్యక్తి అసభ్యకర వీడియోలను నటికి పంపాడు. దీంతో వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.