Homeఫ్లాష్ ఫ్లాష్Hardik-Natasha: హార్దిక్-నటాషా మధ్య విభేదాలు.. ఈ జంట వీడిపోనుందా.. నటాషా క్లారిటీ ఇచ్చేసిందిగా..?

Hardik-Natasha: హార్దిక్-నటాషా మధ్య విభేదాలు.. ఈ జంట వీడిపోనుందా.. నటాషా క్లారిటీ ఇచ్చేసిందిగా..?

టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి క్రికెట్ విషయాలే కాకుండా తన వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలిచాడు. హార్దిక్ తన భార్య నటాషాతో విడిపోతున్నాడని ప్రచారం జరిగింది. 2018లో పరిచయమైన వీరిద్దరూ గతేడాది అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఏడేళ్ల క్రితం ముంబైలోని ఓ హోటల్‌లో హార్దిక్-నటాషా కలుసుకున్నారు. ఈ పరిచయం స్నేహంగా మారి ప్రేమగా మారింది. 2018లో హార్దిక్ పాండ్యా పుట్టినరోజున ఇచ్చిన పార్టీ తర్వాత, ఇద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఒక సంవత్సరం తర్వాత నటాషా సోషల్ మీడియాలో హార్దిక్ తన బెస్ట్ ఫ్రెండ్ అని పేర్కొంది. హార్దిక్‌ను ప్రశంసిస్తూ పోస్ట్‌లు పెట్టింది. అయితే ఫిబ్రవరి 13, 2023న ఈ జంట వివాహం జరిగింది. ఆ తర్వాత హార్దిక్-నటాషా జీవితం మరింత సంతోషంగా మారింది.
అయితే తాజాగా నటాషా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి హార్దిక్ పేరును తొలగించడంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం జరుగుతుంది. ఈ జంట విడిపోయారనే పుకార్లు జాతీయ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నటాషా.. కొంతకాలంగా పోస్ట్‌లు తక్కువగా చేయడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. అయితే ఈ వార్తలపై నటాషా పరోక్షంగా స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. హార్దిక్‌తో తాను సంతోషంగా ఉన్నానని పరోక్షంగా పోస్ట్‌లో వెల్లడించి ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత రోహిత్ అభిమానుల నుంచి హార్దిక్ విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్దిక్ ఫ్యామిలీ సోషల్ మీడియాకు దూరంగా ఉందని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img