అమెరికా వెళ్లి ప్రభాకర్‌రావును కలిసారన్న ఆరోపణలపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ‘ నేను అమెరికా వెళ్లింది వాస్తవం. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాను. ఐపీసీ అధికారి ప్రభాకర్‌రావును కలవలేదు. కలిశానని నిరూపిస్తే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తా. ఏ దేశం వెళ్లాను. హోటల్ వివరాలు, అడ్రస్‌తో సహా ఇస్తా. నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం చౌకబారుతనానికి నిదర్శనం’ అని అన్నారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని కేసీఆరే ప్రభాకర్ రావు దగ్గరకు పంపినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు.