పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘హరి హర వీర మల్లు’. ఈ సినిమాకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి పవన్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యారు. ఈ మేరకు ధర్మం కోసం పోరాటం లో ఆఖరి అధ్యాయం మొదలు అంటూ చిత్రబృందం పవన్ కళ్యాణ్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. ఈ సినిమాని ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 మార్చి 28న థియేటర్లో రిలీజ్ కానుంది.