Homeహైదరాబాద్latest News'హరి హర వీర మల్లు' మూవీ షూటింగ్ అప్డేట్..! చివరి షెడ్యూల్ ఎక్కడో తెలుసా..?

‘హరి హర వీర మల్లు’ మూవీ షూటింగ్ అప్డేట్..! చివరి షెడ్యూల్ ఎక్కడో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘హరి హర వీర మల్లు’. ఈ సినిమాకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. హాలీవుడ్ లెజెండరీ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో ఈ సినిమాలోని ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించారు. హీరో పవన్ కళ్యాణ్ తో పాటు 400-500 మందితో చేసే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అని తెలిపారు.ఈ వారాంతంలో విజయవాడలో సినిమా చివరి షెడ్యూల్ ప్రారంభం కానుంది అని చిత్రబృందం ప్రకటించింది.ఈ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఈ సినిమాని ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ. దయాకర్‌రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 మార్చి 28న థియేటర్లో రిలీజ్ కానుంది.

Recent

- Advertisment -spot_img