దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ “హరిహర వీరమల్లు”. అయితే అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “హరిహర వీరమల్లు” సినిమా టీజర్ కట్‌ని మేకర్స్ విడుదల చేసారు. ఈ టీజర్ ఎవరూ ఊహించని స్థాయిలో ఉంది. నైజం నవాబు కాలంలో ప్రజల కోసం పోరాడే యోధుడిగా పవన్ కళ్యాణ్ తన పాత్రలో ఒదిగిపోయాడనే చెప్పాలి. అంతే కాకుండా సినిమాలోని విజువల్స్ ఊహించని విధంగా ఉన్నాయి. నటుడు బాబీ డియోల్ పాత్ర కూడా అతని మేకోవర్‌లో ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఈ సినిమా కోసం పవన్ స్పెషల్ మార్షల్ ఆర్ట్స్ ట్రై చేసాడు. ఇవి ఓ రేంజ్ లో పవన్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఉన్నాయి. అలాగే టీజర్‌లో కీరవాణి ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ కమిట్ అయిన రాజకీయ అజెండా కారణం గా వాయిదా పడుతూ వస్తోంది.