Harihara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ”హరిహర వీరమల్లు” అనే సినిమాలో నటించాడు. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 9న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా మరోసారి వాయిదా పడింది సమాచారం. ఈ క్రమంలో ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీరమల్లు సినిమా నిర్మాతలకు భారీ షాక్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ నుంచి నిర్మాతలకు ఒక నోటీసు పంపించారు. ఒకవేళ ఈ సినిమా మే 9న సినిమా థియేటర్లలో విడుదల కాకపోతే, అమెజాన్ ప్రైమ్ ఒప్పందంలోని రేటును 50% తగ్గించవచ్చని లేదా సినిమాను పూర్తిగా ఓటిటి డీల్ క్యాన్సిల్ చేస్తారు అని నోటీసు పంపినట్లు సమాచారం.
అయితే ఇప్పటికే ఈ సినిమా ఇప్పటికే 11 సార్లు వాయిదా పడింది. ఇది తెలుగు సినిమా చరిత్రలోనే ఒక రికార్డుగా నిలిచింది. పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్, రాజకీయలు మరియు VFX పనుల కోసం 20 టీమ్‌లు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నప్పటికీ, సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలో నిర్మాతలు మే 30 లేదా జూన్ మొదటి వారంలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది.