Harish Rao : తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రస్తుతం HCU భూ వివాదం సంచలనంగా మారింది. తాజాగా ఈ విషయంపై బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు కీలక వ్యాఖ్యలు చేసారు. HCUలో వేలాది చెట్లను ధ్వంసం చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక్క చెట్టును కొట్టాలన్నా అనుమతి తీసుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం దరఖాస్తు కూడా చేయలేదు అని అన్నారు. HCU భూములు కుదవపెట్టడానికి మధ్యవర్తిత్వం, బ్రోకర్ కు రూ.169 కోట్లు చెల్లించిన ఈ దేశ చరిత్రలో ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇంకో రూ. 50,000కోట్ల లావాదేవీలకు కూడా ఆ బ్రోకర్ తోనే సంప్రదింపులు జరుపుతున్నారు డీల్ సెట్ కాగానే అవి కూడా అమ్మేస్తారు అని ఆరోపించారు.కోర్టులకు సెలవులు ఉన్న రోజులు చూసి రేవంత్ ప్రభుత్వం చెట్లు నరుకుతున్నారు. సెలవులు చూసి కూల్చివేతలు చేస్తున్నారని, ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రాకు హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది అని హరీష్ రావు అన్నారు. జింక చనిపోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీసులు సుమోటో కేసు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు.. అదే ఇన్ని చెట్లు నరికేసి, జింకల చావుకు కారణమైన వారిపై పోలీసులు ఎందుకు కేసులు పెట్టడం లేదు అని హరీష్ రావు నిలదీశారు. వేలాది ఎకరాలను కొట్టేస్తుంటే..అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. పట్టాభూమిలో చెట్టు కొట్టాలంటే అనుమతి అవసరం. ప్రభుత్వం ఎలాంటి అనుతులు తీసుకోకండా వేలాది చెట్లను కొట్టేసింది అని హరీష్ రావు ప్రభుత్వంపై మండిపడ్డారు.