Homeహైదరాబాద్latest NewsHarish Rao : అబద్ధానికి ప్యాంటు, షర్టు వేస్తే అదే రేవంత్ రెడ్డి

Harish Rao : అబద్ధానికి ప్యాంటు, షర్టు వేస్తే అదే రేవంత్ రెడ్డి

Harish Rao : తెలంగాణ సీఎం రేవంత్ రెడీపై బిఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేసారు. పరేడ్‌ గ్రౌండ్‌ సాక్షిగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క బహిరంగంగా పచ్చి అబద్ధాలు చెప్తున్నారు అని హరీష్ రావు ఆరోపించారు. మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం అని అబద్ధాలు చెప్పారు. మరీ అంత బహిరంగంగా ఎందుకు మహిళలను మోసం చేస్తున్నారు అని అన్నారు. అసలు అబద్ధానికి ప్యాంటు, షర్టు వేస్తే అదే రేవంత్ రెడ్డి అని అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి జవాబుదారీతనంతో మాట్లాడాలి అని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు మాపై బురదజల్లారు.. సీఎంగా కూడా అవే అబద్ధాలు చెబితే ఎలా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి.. నువ్వు అనుకోకుండా నిజం మాట్లాడినా నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు సున్నా ఫలితాలను ఇచ్చిందని హరీష్ రావు విమర్శించారు మరియు కాంగ్రెస్ ప్రచారం మొత్తం బోగస్, డొల్ల అని అన్నారు. మీ అబద్ధాలు విని తట్టుకోలేక మహిళలు నిన్న సభ నుండి వెళ్లిపోయారని హరీష్ రావు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img